National Education News | కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు దరఖాస్తులు ఆహ్వానం
National Education News | కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు దరఖాస్తులు ఆహ్వానం
నోటిఫికేషన్ విడుదల చేసిన ఏఐసిటీఈ
డిసెంబర్ 14 నుంచి 26 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు అవకాశం
Hyderabad : దేశ వ్యాప్తంగా కొత్త ఇంజినీరింగ్ (Engineering Colleges ) కాలేజీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తూ సోమవారం (All India Council For Technical Education- AICTE) నిర్ణయం తీసుకుంది. కొత్త కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం కోసం దరఖాస్తులు కోరుతూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీసీఏ, పాలిటెక్నిక్ వంటి వ్రుత్తి విద్యా కాలేజీలు ఏర్పాటు చేసుకునే వారికి ఇదోక చక్కని అవకాశంగా భావించుకోవచ్చు. కొత్త కాలేజీలు ఏర్పాటు చేసుకునే యాజమాన్యాలు డిసెంబర్ 14 నుంచి 26 వరకు గడువు విధించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొనసాగుతున్న కాలేజీలకు అనుమతి పొడిగిస్తూ ఏఐసిటీఈ నిర్ణయం తీసుకుంది. కాలేజీల ఎక్స్ టెన్షన్ కోసం ఈ నెల 25 నుంచి డిసెంబర్ 9 వరకు గడువు విధించింది. కొత్త కాలేజీల ఏర్పాటుకు, కాలేజీ రెన్యువల్స్ కోసం.. ఆలస్య రుసుంతో ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు గడువు విధించారు. అయితే ఇక్కడ మరో మెలికి ఉంటుంది. కొత్త కాలేజీలు ఏర్పాటు చేసుకోవడానికి, లేదా పాత కాలేజీలు రెన్యువల్‌కు ఏఐసిటీఈ అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న యూనివర్సిటీలు అంగీకరిస్తాయా లేదా అన్న అంశంపై మరికొంత వరకు క్లారిటీ రావాల్సి ఉంది. కారణం ఇప్పటికే చాలా ప్రైవేటు కాలేజీలలో వేల సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోవడం. అయితే ఉన్నత స్థాయి ప్రమాణాలతో, నాణ్యమైన విద్యా బోధన అంధించడానికి ముందుకు వచ్చిన యాజమాన్యాలకు కొత్త కాలేజీలు ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం ఏఐసిటీఈ ఎల్లప్పుడూ అనుమతులు ఇస్తూనే ఉంటుంది. అలాగే యూనివర్సిటీలు కూడా అనుబంధం హోదా కూడా ఇవ్వడం ఆనవాయితీ ఉంటుంది.
* * *
Leave A Comment